Saturday, 24 December 2011
Saturday, 10 December 2011
మీరు ఎవరి దగ్గరైన పొలం కొనాలనుకొంటున్నారా
మీరు ఎవరి దగ్గరైన పొలం కొనాలనుకొంటున్నారా
మీరు ఎవరి దగ్గరైన పొలం కొనాలనుకొంటె ముందుగా ఆ పొలం
అమ్మె వ్యక్తిదా కాదా అనె విషయం తెలుసుకొవాలంటె, మీకు పొలాలకు సంబంధించిన వివరాలు కావలంటె మీ దగ్గర కేవలం
ఆ పొలం యెక్క సర్వె నెంబరు వుంటె సరిపొతుంది. ఈ క్రింది సైటు లొ సర్వె నెంబరు ఇస్తె ఆ పొలం యెక్క వివరాలు తెలుస్తాయి.
Wednesday, 30 November 2011
బ్రిటిష్ వారి వల్ల భారత దేశానికి మంచి జరిగిందా ? ---3
ఇప్పటి వరకు బ్రిటిష్ వారు భారత దేశాన్ని ఎలా ఆక్రమించారు,
బ్రిటిష్ వారు రాకముందు పరిస్థితుల గురించి మనం తెలుసుకొన్నాం . బ్రిటిష్ వారు ఇండియాకి వచ్చిన తరువాత వారివల్ల జరిగిన ప్రయొజనాల గూర్చి చర్చిద్దాం .
భారత దేశం ఏర్పడడానికి పరోక్షంగా బ్రిటిష్ వారు కారణం. అప్పటి వరకు ప్రజలు స్థానిక రాజులకు విధేయులుగా ఉండేవారు. బ్రిటిష్ వారి రాకతో స్థానిక రాజుల ప్రాభల్యం పోయి స్వాతంత్ర్యొద్యమ కాలం లొ ప్రజలు జాతీయ సమైక్యత వైపుకు మొగ్గు చూపారు. ఈ విధంగా భారతదేశం ఏర్పడింది.
ప్రస్తుతం మన రాజ్యాంగము లోని చాలా భాగం బ్రిటిష్ వారు రచించిన "1935 ప్రభుత్వ చట్టం" నుంచి గ్రహించినవే. ఇప్పుడు మనం చూస్తున్న చాలా చట్టాలు వారు వదిలి వెళ్ళినవే.
స్వాతంత్రొద్యమ కాలం లో వెనుకబడిన వర్గాలలో, దళితులలో చైతన్యం వచ్చి ప్రజా ఉద్యమల ద్వారా తమ హక్కులను పొం దగలిగారు. ఈ కాలం లోనె మహిళలు అన్ని రంగాలలొ ముందుకు కదిలారు.
అప్పటి వరకు భారతీయులు అన్ని రంగాలలో ప్రాచీన పద్దతులను
వాడుతూ ఉండేవారు. పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఈ రంగాలలో నూతన పద్దతులు ప్రవేశపెట్టడం జరిగింది. అనేక నూతన పరిశ్రమలైన ఇనుము ఉక్కు , కాగితం తయారి పరిశ్రమలు వచ్చాయి. బ్రిటిష్ వారు తమ వ్యాపార నిమిత్తం రైల్వేలకు అనేక రాయితీలను ఇచ్చి ప్రొత్సహించారు. కాని అవి వారికంటే మనకే
ఎక్కువ ఉపయెగపడ్డాయి. అలాగే టెలిఫోను , టెలిగ్రాఫ్ వ్యవస్థను వీరే అభివృద్దిపరిచారు.
అప్పట్లొ సతీసహగమనం అనే మూడాచారం ఉండెది. దీన్ని బ్రిటిష్ వారు నిషేదించారు , అలాగే బాల్య వివాహలను అమలు కాకుండా చట్టాలు చేశారు. ఒక విధంగా ఆ రోజుల్లొ చదువులు సామాన్యులకు కూడా అందాయంటె దానికి వీరే కారణం.
భారత బాషలలొ ఉన్న అనేక గ్రంధాలను తమ భాషలో కి
తర్జుమా చేసి ప్రపంచానికి అందించారు. భారత దేశానికి సంబంధించి
మరుగుపడిపోయిన అనేక విషయాలను వెలికితీశారు. బ్రిటిష్ వారిలొ కొంతమంది మహాను భావులు మన దేశానికి ఎనలేని సేవ చేశారు. వారిని సదా మనం గుర్తు చేసుకోవాలి.
మన దేశం లోని ఆర్దిక, సామాజిక , పారిశ్రామిక, రాజకీయ రంగాలలొ విప్లవాత్మక మార్పులు రావడానికి బ్రిటిష్ వారే కారణం.
నమస్తే .
Saturday, 26 November 2011
ఇంజనీరింగ్ విద్యార్దుల కొరకు
ఇంజనీరింగ్ విద్యార్దుల కొరకు ఇండియాలొని ఐ.ఐ.టి విశ్వవిద్యాలయలు అన్ని ఒక ప్రాజెక్టును ప్రారంబించాయి.
ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యము ఐ. ఐ. టి కాలేజిలొ జరిగే టీచింగ్ అంతా
విడియొ లలొ పొందుపరుస్తాయి. అంతేకాకుండా ఇంజనీరింగ్ మెటిరియల్ అందిస్తాయి. ఆ సైటు ఆడ్రస్ :
Wednesday, 23 November 2011
బ్రిటిష్ వారి వల్ల భారత దేశానికి మంచి జరిగిందా ? ---2
బ్రిటిష్ వారి వల్ల భారత దేశానికి మంచి జరిగిందా ? ---2
బ్రిటిష్ వారు రాకముందు ఇండియాలో ని పరిస్థితుల
గూర్చిచ ర్చిద్దాం.
బ్రిటిష్ వారు రాకముందు ఈ దేశాన్ని భారత దేశం అనేదాని కంటె భారత ఉప ఖండం అని పిలవాలి. ఎందుకంటె అప్పటికి ఈ భారత దేశం ఒక విధంగా ఏర్పడలేదని చెప్పవచ్చు. అప్పుడు అనేక మంది రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఒక జిల్లా విస్తిర్ణ మంత రాజ్యాలు అప్పుడు ఉండేవి, పెద్ద రాజ్యాలు అయితె ఇప్పటి రెండు , మూడు రాష్త్రాల విస్తీర్ణం అంత ఉండెవి.
రాజుల మధ్య ఎలాంటి సహృదయ భావం లేకపోగా ఎప్పుడూ
కలహించుకొంటూ ఉండేవారు. ఆ రోజుల్లో రాజులు ఎప్పుడు యుద్దాలతొ మునిగితేలుతుండేవారు. రాజ్యంలోని ప్రజలకు సరియైన రక్షణ లేకుండాపోయింది, అంతేకాకుండా అప్పుడు రాచరిక పాలన ఉండేది. అంటే రాజు పదవి వారసత్వంగా వచ్చేది.
అప్పటి సాంఘిక పరిస్థితులు గురించి చర్చిద్దాం.
అప్పుటి వృత్తుల వల్ల కులాలు ఏర్పడ్డాయి. సమాజం అగ్ర కులాలు, నిమ్న కులాలు గా విడిపోయింది. అగ్ర కులాలు చెప్పిందే వేదం గా ఉండేది. ఒక విదంగా అగ్రకులాలు నిమ్నకులాలను అనేక బాధలకు గురిచేసేవారు. దళితుల పరిస్థితి మరింత ఆధ్వానంగా ఉండేది.
అప్పటి సమాజం వాళ్ళ హక్కులను వారికి కాకుండా చెసింది.
స్త్రీ లకు సమాజంలో సముచిత స్థానము లేదు. విద్య
ఏ వర్గం వారికీ అందుబాటులొ లేదు. మూఢనమ్మకాలు ఎక్కువగా
ఉండేవి. బాల్య వివాహలు , సతీ నహగమనం అట్లాగె బానిసత్వం ఆనాటి సమాజంలొ ఎక్కువగా ఉన్నాయి. చదువు అగ్ర కులాలకు తప్ప సామన్యులకు అందేది కాదు. చాలా మంది ప్రజలు వ్యవసాయం మీదె ఆధార పడి జీవించేవారు. చేనెత పరిశ్రమ తప్పిస్తే
మిగిలిన ఏ పరిశ్రమ అంతగా అబివృద్ది సాధించలేదు.
ఇంకా ఉంది.......
Friday, 18 November 2011
Tuesday, 15 November 2011
బ్రిటిష్ వారి వల్ల భారత దేశానికి మంచి జరిగిందా ? -- 1
బ్రిటిష్ వారి వల్ల భారత దేశానికి మంచి జరిగిందా ?
బ్రిటిష్ రాణి అనుమతితొ వ్యాపారం కొసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెని భారత దేశానికి వచ్చింది. ఇక్కడి స్థానిక రాజుల అనుమతితొ అనేక చోట్ల వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకొంది. కోటలను నిర్మించుకొంది. వాటిలొ ప్రధానమైన వ్యాపార కేంద్రాలుగా కలకత్తా, మచిలీపట్నం, మద్రాస్ , ముంబాయ్ , సూరత్ , ఆగ్రా లు ఉన్నాయి.
అప్పటికె పొర్చిగీసు వారు , డచ్చివారు భారత దేశంతొ వ్యాపార
సంబందాలు కలిగి ఉన్నారు. దీనితొ ఈ దేశాలకు , బ్రిటిష్ వారికి
మధ్య వ్యాపార సంబందమైన పోటి ఏర్పడింది. ఈ పోటి కాస్తా యుద్దాలకు దారితీసింది. ఈ యుద్దాలలొ బ్రిటిష్ పై చెయ్యి సాధించింది. ఆ తరువాత వచ్చిన ఫ్రెంచి వారితొ కూడా వైరం తెచ్చుకొని వారిని కూడా జయించింది. అంతెకాకుండా
స్థానిక రాజులతొ వైరం పెట్టుకొని వారి రాజ్యలను ఆక్రమించుకొంది.
దీనికి అప్పటి రాజుల స్వయంకృతాపరాధంగానె మనం పరిగణించాలి. అందుకంటె అప్పటికె మొఘల్ సామ్రాజ్యం క్షిణ దశలొ ఉంది.
రాజుల మద్య ఎలాంటి సహృదయ భావం లేక పోగా ఎప్పుడు కలహించుకొటూ ఉండేవారు. దీనిని ఆసరాగా తీసుకొని బ్రిటిష్ వారు ఒక రాజ్యం తరువాత ఒక రాజ్యం జయించారు.
1757 లొ ప్లాసీ యుద్దం , 1764 లొ బాక్సర్ యుద్దం , కర్ణాటక యుద్దాల వల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెని భారత దేశం లొ తన స్థానాన్ని పదిలంచెసుకొంది.
తరువాత జరిగిన యుద్దాలలొ అనెక మంది రాజులను ఓడించి మొత్తం దేశాన్ని ఆక్రమించారు. 1757 నుంచి 1857 వరకు భారత దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెని పరిపాలించింది. ఆతరువాత 1858 నుంచి 1947 వరకు భారత దేశం బ్రిటిష్ రాణి చెతులలొకి వెళింది.
అంటె మొత్తం 190 సంవత్సరములు బ్రిటిష్ వారు పరిపాలించారు.
ఈ కాలములొనె ప్రపంచములొ అనెక మార్పులు చోటుచేసుకొన్నాయి. బ్రిటను లొ ప్రారంభమైన పారిశ్రామిక విప్లవం
మిగిలిన దేశాలకు విస్తరించింది. ఇక మన దేశానికి వస్తె పారిశ్రామికంగాను, రాజకీయంగాను, ఆర్దికంగాను అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి. మనకు తెలిసినంత వరకు బ్రిటిష్ వారు భారత దేశ సంపదను వారి దేశానికి తరలించారు. అంతేకాకుండా భారతీయులను అనేక బాధలకు, చిత్రహింసలకు గురిచేశారు. ఇది అందరికి తెలిసిన విషయమె కాని మనం ఎప్పుడు ఒక వైపు నుంచి మాత్రమె కాకుండా వేరొక కొణం నుంచి కూడా ఆలోచించాలి. వారి వల్ల మనకు ఎంత కీడు జరిగిందొ అంత మేలు కూడా జరిగింది. మనం ఎప్పుడూ కీడును గురించి చర్చించుకొంటాము గాని మంచిని మరిచిపోతాము. ముందుగా మనం బ్రిటిష్ వారు రాకముందు ఉన్న పరిస్థితులను తెలుసుకోవాలి. అప్పుడె మనకు నిజాలు తెలుస్తాయి.
వారి వల్ల జరిగిన మేలును మీకు చెప్పాలని
నా ఉద్దెశ్యము,దీని గూర్చి వచ్చె పోస్ట్ లొ చర్చిస్తాను.
Saturday, 12 November 2011
తెలుగు నవలల కోసం
తెలుగు నవలల కోసం
నేను ఈ మద్య తెలుగు నవలల కోసం ఇంటర్ నెట్ లొ వెతుకుతుంటె నాకు ఒక బ్లాగు కనిపించింది . ఆ బ్లాగులొ చా్లా
తెలుగు నవలలు ఉన్నాయి. ఆ బ్లాగు ఆడ్రస్:
Thursday, 10 November 2011
షాకిచె సెజలు
షాకిచె సెజలు
ఆర్దిక సంస్కరణలొ బాగంగా సెజ్ లను ప్రయొగాత్మకంగా కేంద్ర ప్రబుత్వంము ప్రారంబించింది. మొదటగా చైనా ఈ సెజ్ లను
మొదలు పెట్టి విజయంసాధించింది.
ఈసెజ్ ల ముఖ్య ఉద్దెశము పరిశ్రమలను ప్రొస్తహించటంతొ పాటు
వాటికి అవసరమైన భూమిని తక్కువ దరకు ప్రభుత్వాలు అదించటంతొ పాటు రాయితీలను అంధిస్తాయి. అంతెకాకుండా
సెజ్ లొని పరిశ్రమలకు కావలిసిన అనుమతులను వెంటనె వచ్చెలా
గవర్నెమెంట్ తగు సహయ సహకారాలు అందిస్తాయి. సెజ్ లొని పరిశ్రమలకు కావలసిన మోలిక సదుపాయాలైన నీరు, విద్యుత్ ,
భూమి లను వెంటనె ప్రభుత్వాలు సమకురుస్తాయి.
ఈ సెజ్ లలొ ఉత్పత్తి అయిన వస్తువులు ప్రజలకు కావలసిన మోలిక అవసరాలను తీరుస్తాయి. అంతెకాకుందా వీటిలొ తయారయిన వస్తువులను ఎగుమతులు చెయటం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిచవచ్చు. అంతెకాకుండా అనెక మంది నిరుద్యొగులకు ఉపాది కల్పిచబడుతుంది. వీటి వల్ల కొంతలొ కొంత వరకు నిరుద్యొగాన్ని ఆరికట్టవచ్చు. ఈ సెజ్ ల వల్ల బారత దేశాన్ని
పారిశ్రామికంగా, ఆర్దికంగా ఆగ్ర దేశాల సరసున నిలబెట్టవచ్చు.
ఇదంతా నాణెనికి ఒక వైపు మాత్రమె మరియొక వైపు ఇప్పుడు చూద్దాం.
సెజ్ లకు పెద్దమొత్తములొ భుములు కావాలి. ఈ భుములను సంపాదించటానికి ప్రభుత్వాలు అడ్డగొలుగా వ్యవహరిస్తున్నాయి.
సెజ్ లకు నిరుపయొగమైన భూములను ఇవ్వాలి కాని వీటికి
పచ్చని పొలలను రైతులు సాగు చెస్తున్నా వాటిని ఆక్రమంగా
లాక్కుని సెజ్ లకు కట్టపెడుతున్నాయి ప్రభుత్వాలు. రైతులనుచ్చి
తక్కువ దరకు ప్రభుత్వాలు భూములను స్వాదీనంచెసుకొని రైతుల హక్కులను కాలరాస్తున్నాయి. మరొ బాదాకరమైన విషయం పచ్చని పొలాలను సెజ్ లకు ఇవ్వటం జరుగుతుంది. దీని వల్ల
సాగుకు అవసరమైన భూమి తక్కువై తరువాత వ్యవసాయం మిద ఉత్తిడి పెరుగుతుంది., అంతెకాకుందా ఆహర కొరత ఏర్పడి ఆహర దరలు సామన్య ప్రజలు కొనలెనంతగా ఉంటాయి. సెజ్ ల ఎర్పాటులొ ఒక పద్దతి అంటు లెకుండా ప్రబుత్వాలు
వ్య వహరిస్తున్నాయి. మహరాష్ట్రా తరువాత అత్యదికం సెజ్ లు మన రాష్ట్రం లొనె ఉన్నాయి. వీటి కెటాయింపులలొ కూడా ప్రభుత్వాలు ఇష్టా రాజ్యముగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం దేశ జనభా 121 కోట్ల కు చెరుకొంది. ఇంత మొత్తానికి అవసరమైన ఆహరాన్ని అందించలంటె సాగు చెసె భూములను ,
వ్యవసాయాన్ని విస్తరించలి. కాని సాగు భుములను పరిశ్రమలకు కెటయించడం వల్ల వ్యవసాయం కుంటుపడుతుంది. భవిష్యత్తులొ
దేశం ఆకలికి అలమటిస్తుంది. చాలా మంది వ్యవసాయదారులు తమ వృత్తులను కొల్పొవలసివస్తుంది. అంతెకాకుండా ఈ పరిశ్రమల వల్ల జల కాలుష్యం , గాలి కాలుష్యం భూమి కాలుష్యం జరుగుతుంది. ఈ పరిశ్రమలకు దగ్గారగా ఉన్నా పల్లెలు, పట్నాలలొ ని ప్రజలకు అనెక ఆరొగ్య సమస్యలు చుట్టుముడతాయి.
రైతులనుంచి వస్తున్న వ్యతిరెకతను గ్రహించిన కేంద్ర ప్రభుత్వము
2005 లొ సెజ్ ల మిద మొయిలి అద్యక్షతన ఒక కమిటిని ఎర్పాటు చెసింది. ఈ కమిటి సెజ్ లొని సమస్యలను గ్రహించి వాటిని అరికట్ట డానికి తగిన చర్యలను చెపట్ట వలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి తన నివెదికను సమర్పిచింది. Monday, 7 November 2011
మజిలి లేని మచిలిపట్నం
మచిలీపట్నం వచ్చి నేను 2 సంవత్సరాలు అవుతున్నది .
పుస్తకాలలొ చదువు కున్నదానికి వాస్తవానికి చాల వ్యత్యాసము కనిపించింది. రాజుల కాలములొ అతిపెద్ద పట్నంగా విరాజిల్లి
నేడు అనేక సమస్యలను ఎదురుకుంటున్నది.
చైనా యాత్రికుడు మొగస్తనీస్ రచించిన తన ఇండికా గ్రంధములొ
మచీలిపట్నం గూర్చి ఉంది. అట్లగె అశొకుని్కాలంలొ , తరువాత శాతబాహనకాలమ్ నుంచి బ్రిటిష్ కాలంవరకు ఈ పట్నం అతి పెద్ద
నగరముగా ఉండెది . అప్పటికి ఇప్పుడు మనం పెద్ద నగరాలుగా భావిస్తున్నా ఎ నగరముకుడా అప్పుడు లేవు.
స్వాతంత్రొద్యమ కాలములొ కుడా ముందంజలొ ఉన్న ఈ పట్నం
నేడు అనెక రంగాలలొ వెనకబది ఉంది. ఈదె జిల్లాలొ ఉన్న విజయవాడ బాగ అబివృద్దిచెంది నెడు రాష్ట్ర వాణిజ్య రాజదాని గా మారింది.
1975 వరకు విజయవాడ, గుంటురు, ఎలూరు ,మచిలీపట్నం అబివృద్ది ఒకే రకంగా ఉన్నా 2011 నాటికి పరి్స్తితి పుర్తిగా మారిపొయింది. పైన చెప్పిన పట్నంలు మచిలీపట్నం కంటే యెన్నొ రెట్లు అబివృద్దిచెందాయి.
ప్రస్తుతం మచిలి ఫట్నం దగ్గారగా ఉన్న గుడివాడ , నూజివీడు , బీమవరం , పాలకొల్లు,తాడెపల్లిగూడెం,తణుకు , బాగా అబివృద్ది చెందుతున్నయి. ఈ పట్నాలలొ అనెక పరిశ్రమలతో వి్రాజిల్లుతున్నాయి. ఇక్కడి రియల్ ఎస్టెట్ బాగా అబివృద్ది చెందింది. కాని మచిలీపట్నంలొ ఈ పరిస్తుతులు లేవు.
కృష్ణ జిల్లా ముఖ్య పట్నం అయిన మచీలిపట్నంలొ అనేక సహజ వనరులు ఉన్నా వాటిని వినియొగుంచుకొనె పరిస్తితులు లేవు .
ఇక్కడి రొల్ద్ గొల్ద్ పరిశ్రమ బాగా ఖ్యాతికెకింది . చాలా మంది పని వారు ఈ పరిశ్రమ మీదే ఆధారపడి ఉన్నారు. BEL కంపెని యొక్క unit ఇక్కడ ఉన్నది. దినిలొ రక్షణ శాఖకు సంబందించిన ఉత్పత్తులు తయారుచెస్తారు. మచీలిపట్నం అనేక దేవాలయలకు ప్రసిద్ది చెందింది.ఇక్కడి పాండురంగ స్వామి గుడి చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడి మంగినిపుడి బీచ్ చాలా
సుందరనుగా పర్యటకులను ఆకర్షించె విదంగా ఉంటుండి.
బ్రిటిష్ వారి కాలంలొ ప్రఖ్యాతమైన ఓడ రేవు మచీలిపట్నం ఓడ రేవు . ఒకప్పుడు అనేక దేశల తొ వ్యాపార కు్డలిగా ఉండెది.
ఐరోపా , ఆగ్నేయా దేశాలకు అనేక వస్తువులు ఎగుమతులు,
దిగుమతులు మచీలిపట్నం ఓడ రేవు నుంచి జరుగుతుండెవి .
అప్పట్లొ భరత దేశం లోని తూర్పు తీరలొని అతి పెద్ద ఓడ రేవులలొ
ఇది ఒకటిగా ఉండెది. కాని నేడు ఈ ఓడ రేవు అత్యంత దయమయమైన స్తానములొ ఉంది. ఈ రేవును అబివృద్ది చెస్తే మన రాష్ట్రానికి చాలా
ఉపయొగకరంగా ఉంటుండి. కాని ప్రస్తుత మంత్రులు ఎవరు ఈ రేవుకు అంత ప్రాధ్యాన్యత ఇవ్వటంలేదు.
మచిలిపట్నం భవిష్య త్తు అంతా ఈ రేవు మీదే ఆదారపది వుంది.
అశొకుని కాలం నుంది బ్రిటిష్ కాలం వరకు అతి పెద్ద నగరంగా ఉన్న ఈ పట్నం నేడు అబివృద్దికి నొచుకొకుండా ఉంది. Thursday, 3 November 2011
appsc group1 and group2 telugu audio material
appsc group 1 and 2 telugu audio material
link : http://www.lazydesis.com/career-buzz/312777-appsc-group-1-2-audio-material-free-download.html
Monday, 31 October 2011
ఇండియా సూపర్ సూపర్ కాగలదా:
ఇండియా సూపర్ సూపర్ కాగలదా :
ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచం అనేక సమస్యలు సవాళ్లను ఎదురుకొంటుంది.అమెరికా తన ఆగ్ర దేశం హుదాను
జార విడుచు కొంటున్నది .విశ్లేషకుల కళ్ళు ఇప్పుడు చైనా మీద ఉంది . ఎందు కంటే చైనా అతిపెద్ద ఎగుమతి దేశంగా ఆవిర్భవించింది మరియు ఇప్పటి వరకు రెండవ అతి పెద్ద ఆర్ధిక దేశం గా ఉన్న జపాన్ ను 3వ
స్తానమున కు నెట్టి త ను అమెరికా తరువాత స్థానాని ఆక్రమించింది . ఇక భారత దేశాని వస్తే వచ్చే దశాబ్దములో 3 వ స్తానమ ఆక్రమీస్తుందని ఆర్ధిక వేత్తల నమ్మకం
కాని అంతకుముందే ఇండియా అనేక సమస్యలను ,సవాళ్ళను ఎదురుకో వలసిన అవసరం ఉంది .
ఇండియా ముందున్న సమస్యలు
1. అధిక జనాభా
2. పేదరికము
3. విద్య
4. రాజకీయాలు
5. అవినీతి
పైన చెప్పిన విషయాలలో భారత దేశం ద్రుష్టి పెట్టవలసి ఉంది .
వీటి గురించి వచ్చే పోస్ట్ లో చర్చిద్దాము .
Saturday, 29 October 2011
my blog
నేను ఈ బ్లాగ్ ను వాస్తవ పరిస్థితులు ఆదారంగా మరియు విశ్లేషణ ద్వారా కులంకసముగా వివారిచాలనేది నా ప్రయత్నం .
నాకు తెలిసిన జాబ్స్ ,కంప్యూటర్ కు ,విద్య కు సంబందించిన వివరాలను మీ ముందుచాలని నా ప్రయత్నం .
నాతో ఎలాంటి information అయిన పంచుకోవచ్చు.
Subscribe to:
Posts (Atom)