Tuesday 15 November 2011

బ్రిటిష్ వారి వల్ల భారత దేశానికి మంచి జరిగిందా ? -- 1




బ్రిటిష్ వారి వల్ల భారత దేశానికి మంచి జరిగిందా ?
బ్రిటిష్ రాణి అనుమతితొ  వ్యాపారం కొసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెని భారత దేశానికి వచ్చింది. ఇక్కడి స్థానిక రాజుల అనుమతితొ   అనేక చోట్ల వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసుకొంది. కోటలను నిర్మించుకొంది. వాటిలొ ప్రధానమైన  వ్యాపార కేంద్రాలుగా  కలకత్తా, మచిలీపట్నం, మద్రాస్ , ముంబాయ్ , సూరత్ , ఆగ్రా లు ఉన్నాయి.
అప్పటికె పొర్చిగీసు వారు , డచ్చివారు భారత దేశంతొ వ్యాపార
సంబందాలు కలిగి ఉన్నారు. దీనితొ ఈ దేశాలకు , బ్రిటిష్ వారికి
మధ్య వ్యాపార సంబందమైన పోటి ఏర్పడింది. ఈ పోటి కాస్తా యుద్దాలకు దారితీసింది. ఈ యుద్దాలలొ బ్రిటిష్ పై చెయ్యి సాధించింది. ఆ తరువాత వచ్చిన ఫ్రెంచి వారితొ కూడా వైరం తెచ్చుకొని వారిని కూడా జయించింది. అంతెకాకుండా
స్థానిక రాజులతొ వైరం పెట్టుకొని వారి రాజ్యలను ఆక్రమించుకొంది.
దీనికి అప్పటి రాజుల స్వయంకృతాపరాధంగానె మనం పరిగణించాలి. అందుకంటె అప్పటికె మొఘల్ సామ్రాజ్యం క్షిణ దశలొ ఉంది.
రాజుల మద్య ఎలాంటి సహృదయ  భావం లేక పోగా ఎప్పుడు కలహించుకొటూ ఉండేవారు. దీనిని ఆసరాగా తీసుకొని బ్రిటిష్ వారు ఒక రాజ్యం తరువాత ఒక రాజ్యం జయించారు.
 1757 లొ ప్లాసీ యుద్దం  , 1764 లొ బాక్సర్ యుద్దం , కర్ణాటక యుద్దాల వల్ల బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెని భారత దేశం లొ తన స్థానాన్ని పదిలంచెసుకొంది.
తరువాత జరిగిన యుద్దాలలొ అనెక మంది రాజులను ఓడించి మొత్తం దేశాన్ని ఆక్రమించారు. 1757 నుంచి 1857 వరకు భారత దేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెని  పరిపాలించింది. ఆతరువాత 1858 నుంచి 1947 వరకు భారత దేశం బ్రిటిష్ రాణి చెతులలొకి వెళింది.
అంటె మొత్తం 190 సంవత్సరములు బ్రిటిష్ వారు పరిపాలించారు.
ఈ కాలములొనె ప్రపంచములొ అనెక మార్పులు చోటుచేసుకొన్నాయి. బ్రిటను లొ ప్రారంభమైన  పారిశ్రామిక విప్లవం
మిగిలిన దేశాలకు విస్తరించింది. ఇక మన దేశానికి వస్తె పారిశ్రామికంగాను, రాజకీయంగాను, ఆర్దికంగాను అనేక మార్పులు చోటుచేసుకొన్నాయి.  మనకు తెలిసినంత వరకు బ్రిటిష్ వారు భారత దేశ సంపదను  వారి దేశానికి తరలించారు. అంతేకాకుండా భారతీయులను అనేక బాధలకు, చిత్రహింసలకు  గురిచేశారు. ఇది అందరికి తెలిసిన విషయమె కాని మనం ఎప్పుడు ఒక వైపు నుంచి మాత్రమె కాకుండా వేరొక కొణం నుంచి కూడా ఆలోచించాలి. వారి వల్ల మనకు ఎంత కీడు జరిగిందొ అంత మేలు కూడా జరిగింది. మనం  ఎప్పుడూ కీడును గురించి చర్చించుకొంటాము గాని మంచిని మరిచిపోతాము. ముందుగా మనం బ్రిటిష్ వారు రాకముందు ఉన్న పరిస్థితులను తెలుసుకోవాలి. అప్పుడె మనకు నిజాలు తెలుస్తాయి.
  వారి వల్ల జరిగిన మేలును మీకు చెప్పాలని
నా ఉద్దెశ్యము,దీని గూర్చి వచ్చె పోస్ట్ లొ చర్చిస్తాను.


4 comments:

  1. మంచి విషయం మీద చక్కగా మొదలు పెట్టారు వాళ్ళ నించి మనకి జరిగిన ఎన్నో దారుణాలను ప్రక్కన పెడితే మంచి విషయాలు కూడా చాలానే ఉన్నాయి వారు మనకి చేసినవి. ముఖ్యంగా సి పి బ్రౌన్ లాంటి వారి వలన మనమెంతో లాభ పడ్డాం. మీరు ముందుకి సాగండి! నేను సైతం అంటూ చదువుతాను.

    ReplyDelete
  2. 1.భారతరాజకీయ ఏకీకరణ: ఇదివరకూ భారతదేశం అనే ఒక ఆలోచన ఉన్నప్పటికీ,చిన్నచిన్న రాజ్యాలుగా విడిపడుండేదేగానీ కలిసికట్టుగా ఒక రాజకీయ భాగంగా రూపిదిద్దుకోలేదు. పైపెచ్చు ఎప్పుడూ తమలోతాము కొట్టుకుంటూ,యుద్ధాలు చేసుకుంటూ ఉండేవాళ్ళు.

    2.ఇంగ్లీషు భాషాభోధన: ఇక్కడే మెకాలే మినిట్స్ ప్రాముఖ్యత తెలుస్తుంది. అప్పటివరకూ inter state-language communication ఒక పెద్ద అఘాతంలా వుండేది. ఈ ఇంగ్లీషుద్వారా అది సులభతరం అయ్యింది.స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఆలోచనల వ్యాప్తికి ఈ భాషచేసిన మేలు అంతాఇంతా కాదు. ఈ భాషలో చదివి స్వతంత్ర్యభావాలను అందిపుచ్చుకున్న తరువాతే, గోఖలే,గాంధీ,నెహ్రూ వంటివారు స్వాతంత్ర్యోద్యమంలోకి దిగి బ్రిటిష్ వారిని వారి "rule of law" ఉపయోగించే దెబ్బతీసారు.

    3.ప్రింటింగ్ ప్రెస్ మరియూ టెలిగ్రాం: స్వాతంత్ర్యోద్యమ వ్యాప్తిలో ప్రెస్ మరియూ పోస్టల్ సర్విస్ పాత్ర గురించి మీరు ‘బిపిన్ చంద్ర’ను చదవండి.

    4.రైల్వే: బ్రిటిష్ వారు అసంకల్పితంగా అందించిన మరో లాభం భారతీయరైల్వే.

    5.మిలిటరీ: బ్రిటిష్ వారికి పూర్వం మన సేన ఇంత వ్యవస్థీకృతం కాలేదు. ఇప్పటికీ చాలా బెటాలియన్ల పేర్లు అప్పటివే ఉంటాయి. గమనించండి.

    ReplyDelete
  3. *వారి వల్ల మనకు ఎంత కీడు జరిగిందొ అంత మేలు కూడా జరిగింది.*
    అయ్యా విజయ్, మీ వివరాలు తెలియవు. వాళ్లు చేసిన కీడు సమానంగా మేలు జరిగిందా? కొంచెం వివరించి చెప్పరు, తెలుసు కొంటాము.

    ReplyDelete