Thursday 10 November 2011

షాకిచె సెజలు



షాకిచె సెజలు
ఆర్దిక సంస్కరణలొ బాగంగా సెజ్ లను ప్రయొగాత్మకంగా కేంద్ర ప్రబుత్వంము ప్రారంబించింది. మొదటగా చైనా ఈ సెజ్ లను
మొదలు పెట్టి విజయంసాధించింది.
ఈసెజ్ ల ముఖ్య ఉద్దెశము పరిశ్రమలను ప్రొస్తహించటంతొ పాటు
వాటికి అవసరమైన భూమిని తక్కువ దరకు ప్రభుత్వాలు అదించటంతొ పాటు రాయితీలను అంధిస్తాయి. అంతెకాకుండా
సెజ్ లొని పరిశ్రమలకు కావలిసిన అనుమతులను వెంటనె వచ్చెలా
గవర్నెమెంట్ తగు సహయ సహకారాలు అందిస్తాయి. సెజ్ లొని పరిశ్రమలకు కావలసిన మోలిక సదుపాయాలైన నీరు, విద్యుత్ ,
భూమి లను వెంటనె ప్రభుత్వాలు సమకురుస్తాయి.

ఈ సెజ్ లలొ ఉత్పత్తి అయిన వస్తువులు ప్రజలకు కావలసిన మోలిక అవసరాలను తీరుస్తాయి. అంతెకాకుందా వీటిలొ తయారయిన వస్తువులను ఎగుమతులు చెయటం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిచవచ్చు. అంతెకాకుండా అనెక మంది నిరుద్యొగులకు ఉపాది కల్పిచబడుతుంది. వీటి వల్ల కొంతలొ కొంత వరకు నిరుద్యొగాన్ని ఆరికట్టవచ్చు. ఈ సెజ్ ల వల్ల బారత దేశాన్ని
పారిశ్రామికంగా, ఆర్దికంగా ఆగ్ర దేశాల సరసున నిలబెట్టవచ్చు.
ఇదంతా నాణెనికి ఒక వైపు మాత్రమె మరియొక వైపు ఇప్పుడు చూద్దాం.
సెజ్ లకు పెద్దమొత్తములొ భుములు కావాలి. ఈ భుములను సంపాదించటానికి ప్రభుత్వాలు అడ్డగొలుగా వ్యవహరిస్తున్నాయి.
సెజ్ లకు నిరుపయొగమైన  భూములను ఇవ్వాలి కాని వీటికి
పచ్చని పొలలను రైతులు సాగు చెస్తున్నా వాటిని ఆక్రమంగా
లాక్కుని సెజ్ లకు కట్టపెడుతున్నాయి ప్రభుత్వాలు. రైతులనుచ్చి
తక్కువ దరకు ప్రభుత్వాలు భూములను స్వాదీనంచెసుకొని రైతుల హక్కులను కాలరాస్తున్నాయి. మరొ బాదాకరమైన విషయం పచ్చని పొలాలను సెజ్ లకు ఇవ్వటం జరుగుతుంది. దీని వల్ల
సాగుకు అవసరమైన భూమి తక్కువై తరువాత  వ్యవసాయం మిద ఉత్తిడి పెరుగుతుంది., అంతెకాకుందా ఆహర కొరత ఏర్పడి ఆహర దరలు సామన్య ప్రజలు కొనలెనంతగా ఉంటాయి. సెజ్ ల ఎర్పాటులొ ఒక పద్దతి అంటు లెకుండా ప్రబుత్వాలు
వ్య వహరిస్తున్నాయి. మహరాష్ట్రా తరువాత అత్యదికం సెజ్ లు మన రాష్ట్రం లొనె ఉన్నాయి. వీటి కెటాయింపులలొ కూడా ప్రభుత్వాలు ఇష్టా రాజ్యముగా వ్యవహరిస్తున్నాయి. ప్రస్తుతం దేశ జనభా 121 కోట్ల కు చెరుకొంది. ఇంత మొత్తానికి అవసరమైన ఆహరాన్ని అందించలంటె సాగు చెసె భూములను ,
వ్యవసాయాన్ని విస్తరించలి. కాని సాగు భుములను పరిశ్రమలకు కెటయించడం వల్ల వ్యవసాయం కుంటుపడుతుంది. భవిష్యత్తులొ
దేశం ఆకలికి అలమటిస్తుంది. చాలా మంది వ్యవసాయదారులు తమ వృత్తులను కొల్పొవలసివస్తుంది. అంతెకాకుండా ఈ పరిశ్రమల వల్ల జల కాలుష్యం , గాలి కాలుష్యం భూమి కాలుష్యం జరుగుతుంది. ఈ పరిశ్రమలకు దగ్గారగా ఉన్నా పల్లెలు, పట్నాలలొ ని ప్రజలకు  అనెక ఆరొగ్య సమస్యలు చుట్టుముడతాయి.
రైతులనుంచి వస్తున్న వ్యతిరెకతను గ్రహించిన కేంద్ర ప్రభుత్వము
2005 లొ సెజ్ ల మిద  మొయిలి అద్యక్షతన ఒక కమిటిని ఎర్పాటు చెసింది. ఈ కమిటి సెజ్ లొని  సమస్యలను గ్రహించి వాటిని అరికట్ట డానికి తగిన చర్యలను చెపట్ట వలసిందిగా కేంద్ర ప్రభుత్వానికి తన నివెదికను సమర్పిచింది. 

No comments:

Post a Comment