Wednesday 30 November 2011

బ్రిటిష్ వారి వల్ల భారత దేశానికి మంచి జరిగిందా ? ---3




ఇప్పటి వరకు బ్రిటిష్ వారు భారత దేశాన్ని ఎలా ఆక్రమించారు,
బ్రిటిష్ వారు రాకముందు పరిస్థితుల  గురించి మనం తెలుసుకొన్నాం . బ్రిటిష్  వారు ఇండియాకి వచ్చిన తరువాత వారివల్ల జరిగిన ప్రయొజనాల గూర్చి చర్చిద్దాం .

భారత దేశం ఏర్పడడానికి పరోక్షంగా బ్రిటిష్ వారు కారణం. అప్పటి     వరకు ప్రజలు స్థానిక రాజులకు విధేయులుగా ఉండేవారు. బ్రిటిష్ వారి రాకతో స్థానిక రాజుల ప్రాభల్యం పోయి స్వాతంత్ర్యొద్యమ కాలం లొ ప్రజలు జాతీయ సమైక్యత వైపుకు మొగ్గు చూపారు. ఈ విధంగా భారతదేశం ఏర్పడింది.
ప్రస్తుతం మన రాజ్యాంగము లోని చాలా భాగం బ్రిటిష్ వారు రచించిన "1935 ప్రభుత్వ చట్టం" నుంచి గ్రహించినవే. ఇప్పుడు మనం చూస్తున్న చాలా చట్టాలు వారు వదిలి వెళ్ళినవే.
స్వాతంత్రొద్యమ కాలం లో వెనుకబడిన వర్గాలలో, దళితులలో చైతన్యం వచ్చి ప్రజా ఉద్యమల ద్వారా తమ హక్కులను పొం దగలిగారు. ఈ కాలం లోనె మహిళలు అన్ని రంగాలలొ ముందుకు కదిలారు.
అప్పటి వరకు భారతీయులు అన్ని రంగాలలో ప్రాచీన పద్దతులను
వాడుతూ ఉండేవారు. పారిశ్రామిక విప్లవ ఫలితంగా ఈ రంగాలలో నూతన పద్దతులు ప్రవేశపెట్టడం జరిగింది. అనేక నూతన పరిశ్రమలైన ఇనుము ఉక్కు , కాగితం తయారి పరిశ్రమలు వచ్చాయి. బ్రిటిష్ వారు తమ వ్యాపార నిమిత్తం రైల్వేలకు అనేక రాయితీలను ఇచ్చి ప్రొత్సహించారు. కాని అవి వారికంటే మనకే
ఎక్కువ ఉపయెగపడ్డాయి. అలాగే టెలిఫోను , టెలిగ్రాఫ్ వ్యవస్థను వీరే అభివృద్దిపరిచారు.
అప్పట్లొ సతీసహగమనం అనే మూడాచారం ఉండెది. దీన్ని బ్రిటిష్ వారు నిషేదించారు , అలాగే బాల్య వివాహలను అమలు కాకుండా చట్టాలు చేశారు. ఒక విధంగా ఆ రోజుల్లొ చదువులు సామాన్యులకు కూడా అందాయంటె దానికి వీరే కారణం.
భారత బాషలలొ ఉన్న అనేక గ్రంధాలను తమ భాషలో కి
తర్జుమా చేసి ప్రపంచానికి అందించారు. భారత దేశానికి సంబంధించి
మరుగుపడిపోయిన అనేక విషయాలను వెలికితీశారు. బ్రిటిష్ వారిలొ కొంతమంది మహాను భావులు మన దేశానికి ఎనలేని సేవ చేశారు. వారిని సదా మనం గుర్తు చేసుకోవాలి.
మన దేశం  లోని ఆర్దిక, సామాజిక , పారిశ్రామిక, రాజకీయ రంగాలలొ విప్లవాత్మక మార్పులు రావడానికి బ్రిటిష్ వారే కారణం.

                                                       నమస్తే .

10 comments:

  1. బ్రిటిష్ వారు మనదేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు పాలించారు .. ఆ కాలం లో వారు సాధించిన అభివృద్ధి యెంత? కేవలం ౬౦ ఏళ్ళ కాలం లో మనదేశం సాధించిన అభివృద్ధి ఏంటో అంచనా వేసి అప్పుడు చెప్పండి వారి వాళ్ల మనకు మంచి జరిగిందా మనం నష్టపోయామ ? ౧౯౫౧ లో తినడానికి మనకి తిండి లేదని అమెరికాని ఆహార ధాన్యాలను అడుక్కున్నాం .. అప్పటికి మనకు స్వతంత్రం వచ్చి కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే. మొన్ని మధ్యనే ఆమెరికా అధ్యక్షుడు మనదేశానికి వచ్చి ఇండియా వాళ్ల తమ దేశస్తులకు దాదాపు ౫౦ వేలమందికి ఉపాది లభిస్తుందని చెప్పారు

    ReplyDelete
  2. ఇష్టమున్నా లేక పోయినా బ్రిటీష్ వాళ్ళు, వారి పరిపాలనా సౌలభ్యం కోసం చేసిన పనులు, ఇంగ్లీష్ నేర్పటం, రైలు మార్గాలు వెయ్యటం, ఉక్కు మొదలగు పరిశ్రమలు స్థాపించటం మొదలయినవి చేశారు. వాటిని మూలాన్కురాలుగా వాడుకుని మనము ఎదిగాము. అల్లాగే ఇంకోటి కూడా చెప్పాలి మన పాత పద్దతులు ఈ కాలంలో మంచీ,చెడూ రెండూ సమసి పోయాయి.

    ReplyDelete
  3. *బ్రిటిష్ వారు తమ వ్యాపార నిమిత్తం రైల్వేలకు అనేక రాయితీలను ఇచ్చి ప్రొత్సహించారు. కాని అవి వారికంటే మనకే ఎక్కువ ఉపయెగపడ్డాయి. *
    అయ్యా,
    రైల్వేలు వారి కంటే ఎక్కువగా మనకు ఎలా ఉపయోగ పడ్డాయో, కొంచెం విశదీకరించి రాయండి. Overall gaa, మీరు రాసిన ఈ వ్యాసం లో పెద్దగా చెప్పుకోదగ్గ పాయింట్ ఎదీ లేదు. చిన్నపుడు సోషల్ పుస్తకం చదివినట్లు ఉంది.

    ReplyDelete
  4. బ్రిటిష్‌వాళ్ళ వల్ల మనకి అంతగా లాభమేమీ కలగలేదు. 1870 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 60% మంది వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడేవాళ్ళు. 1901 నాటికి దేశంలో వ్యవసాయం, పశుపోషణపై ఆధారపడేవాళ్ళ సంఖ్య 70% పెరిగింది. బ్రిటిష్‌వాళ్ళు రాకముందు ఇండియాలో వస్త్రాలు, నీలి మందు (indigo) తయారీ పరిశ్రమలు ఎక్కువగా ఉండేవి. బ్రిటిష్‌వాళ్ళు తమ దేశం నుంచి దిగుమతి చేసిన వస్త్రాలు ఇక్కడ అమ్మడానికి దేశీయ పరిశ్రమలని మూసేశారు. అందుకే బ్రిటిష్ పాలనలో వ్యవసాయంపై ఆధారపడేవాళ్ళ సంఖ్య పెరిగింది. బ్రిటిష్ ఇండియాలో మన దేశంలో మనుషుల సగటు ఆయు:ప్రమాణం కేవలం 25 ఏళ్ళు. ఇది జార్ చక్రవర్తి పాలనలోని రష్యా కంటే అద్వాన్నం. జార్ చక్రవర్తి పాలనలోని రష్యాలో సగటు ఆయు:ప్రమాణం 40 ఏళ్ళు ఉండేది. జార్ చక్రవర్తుల పాలనలో రష్యాలో కూడా మాస్కో, పీటర్స్‌బర్గ్ ప్రాంతాలలో తప్ప ఎక్కడా యంత్ర పరిశ్రమలు లేవు. అప్పట్లో రష్యా ఆర్థికంగా ఎంత వెనుకబడినా విద్యా, వైద్యం లాంటి విషయాలలో ఇండియా కంటే మెరుగ్గా ఉండేది. జార్ చక్రవర్తుల పాలనలోని రష్యాలో అక్షరాస్యత 15% నుంచి 25% వరకు ఉంటే ఇండియాలో మరీ అద్వాన్నంగా 3% నుంచి 12% ఉండేది.

    ReplyDelete
  5. బ్రిటిష్ వారు వలన రైల్ లోచ్చింది, టెలిగ్రాం వచ్చింది అని వారేదో పెద్ద అభివృద్ది చేసినట్లు రాశారు. యురోప్ లో జరిగిన సైన్స్ టేక్నాలజి లోని నూతన ఆవిష్కరణలకి మొత్తం డబ్బుల పెట్టుబడి ఇండియా నుండి అధిక మొత్తం లో టాక్స్ ల రూపం లో వసూలు చేసినవి. ఇక్కడ వారిని పీక్కతిని అక్కడివారు అభివృద్ది ఐనారు. తమ పాలనా సౌలభ్యం కొరకు వారు టెలిఫోను , టెలిగ్రాఫ్ వ్యవస్థలను అభివృద్ది చేశారు. ఇందులో వారు పెద్ద మనసుతో చేసిన సహాయం ఒక్కటి లేదు. బెంగాల్ లో కరవు వస్తే లక్షల్లో ప్రజలు చనిపోతున్నా, ప్రభుత్వ పరంగా పైసా సహాయం చేయలేదు. టాక్స్ ల రూపంలో డబ్బులు దోచుకోవటం ఆపలేదు. అటువంటి వారి మీద మీరు పెద్ద మనసు చూపించి బ్రిటిష్ వారి వలన మేలు జరిందా అని రాయటం విచిత్రంగా ఉంది.

    ReplyDelete
  6. యురోప్ దేశల అభివృద్ది అనేది భారత, ఆసియా దేశాల నెక్తురితో జరిగిందని తెలుసుకోండి. వాళ్ల పాలన పోయినా, ఎక్కడ ప్రజలు బతికి బాగుపడతారో అని, ఎన్నో రకాల విష భావాలను నాటి పోయారు. అందులో భారత ఉపఖండ లో ప్రజలు నిరంతరం కొట్టుకొనే విధంగా కులాల పరంగా,మతల పరంగా చరిత్రను వక్రికరించి పోయారు. అవన్ని ఇప్పుడు బయట పడుతున్నాయి, అందులో ఒకటి ఆర్యులు ద్రవిడులు అనే సిద్దాంతం పచ్చి అబ్బద్దం అని తేలిపోయింది.

    ReplyDelete
  7. బ్రిటిష్‌వాళ్ళ పాలనలో గ్రామాల్లో టాక్సులు వసూలు చెయ్యడానికి కరణం-మునసబ్ (పట్వారీ-పటేల్)లు ఉండేవాళ్ళు. ఈ వ్యవస్థ ఆంధ్ర ప్రదేశ్‌లో 1987 వరకు కొనసాగింది. 1870 లెక్కల ప్రకారం ఇండియా జనాభా ఇరవై కోట్లు. అప్పటి అక్షరాస్యత కేవలం 3% ఉండేది. ఒక గ్రామంలో వెయ్యి మంది జనాభా ఉంటే కేవలం ముప్పై మంది అక్షరాస్యులు ఉండేవాళ్ళన్నమాట. ఆ ముప్పై మందిలో ఒకరు కరణం, ఇంకొకరు మునసబ్, ఇంకొకరు పురోహితుడు అయితే మిగిలిన 27 మంది వాళ్ళ బంధువులు (ఉత్తరాంధ్ర భాషలో భాగహారులు). అప్పట్లో దొరలు, పంతుళ్ళు, వాళ్ళ భాగహారులు మాత్రమే చదువుకునేవాళ్ళన్న మాట. అలా ఉండేది బ్రిటిష్ ఇండియాలోని గ్రామాల పరిస్థితి.

    ReplyDelete
  8. ఒరిస్సాలోని మా పూర్వికుల గ్రామంలో అప్పట్లో కేవలం ఇద్దరే అక్షరాస్యులు ఉండేవాళ్ళు. ఒకరు మునసబ్, ఇంకొకరు కరణం. అప్పట్లో ఆడవాళ్ళకి చదువుకునే అవకాశం ఉండేది కాదు. మునసబ్ గారి భార్యకీ చదువు రాదు, చెల్లెలికీ చదువు రాదు కానీ అతని కొడుకు పట్టణంలో కాలేజ్‌లో చదువుకుని నాలుగు భాషలు (హిందీ, ఇంగ్లిష్, ఒడియా, తెలుగు)లో పాండిత్యం సంపాదించాడు. మునసబ్ గారి కోడలు (వేరే గ్రామం నుంచి వచ్చిన అమ్మాయి) ఆరో తరగతి వరకు చదువుకుంది. అదీ బ్రిటిష్ ఇండియాలోని అక్షరాస్యత పరిస్థితి.

    ReplyDelete
  9. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని సుమారు,300 వందల సంవత్సరాలు పరిపాలించి 1000 సంవత్సరాల మూడవిశ్వాసాలు కొంతైనా పోగొట్టారు. అసలు బ్రిటీషు వాళ్ళు మన దేశానికి రాకుండావుంటే 500 వందల చిన్న రజ్యాలుగావున్న ఈ ప్రాంతం 1000 చిన్న దేశాలుగా ఉండేది!మనవాళ్ళు మనల్న తక్కువగా చూసినా మనకర్మ అనుకొని భ్రతుకుతావుండేవాళ్ళం తప్పా భారతదేశం అనే ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడేదికాదు...అన్నా నిజం.....!

    ReplyDelete