Wednesday 23 November 2011

బ్రిటిష్ వారి వల్ల భారత దేశానికి మంచి జరిగిందా ? ---2

బ్రిటిష్ వారి వల్ల భారత దేశానికి మంచి జరిగిందా ? ---2

బ్రిటిష్ వారు రాకముందు ఇండియాలో ని పరిస్థితుల
గూర్చిచ ర్చిద్దాం.
బ్రిటిష్ వారు రాకముందు ఈ దేశాన్ని భారత దేశం అనేదాని కంటె భారత ఉప ఖండం అని పిలవాలి. ఎందుకంటె అప్పటికి ఈ భారత దేశం ఒక విధంగా ఏర్పడలేదని చెప్పవచ్చు. అప్పుడు అనేక మంది రాజులు ఈ దేశాన్ని పరిపాలించారు. ఇప్పుడు మనం చూస్తున్న ఒక జిల్లా విస్తిర్ణ మంత రాజ్యాలు అప్పుడు ఉండేవి, పెద్ద రాజ్యాలు అయితె ఇప్పటి రెండు , మూడు రాష్త్రాల విస్తీర్ణం అంత ఉండెవి.
రాజుల మధ్య ఎలాంటి సహృదయ భావం లేకపోగా ఎప్పుడూ
కలహించుకొంటూ ఉండేవారు. ఆ రోజుల్లో రాజులు ఎప్పుడు యుద్దాలతొ మునిగితేలుతుండేవారు. రాజ్యంలోని ప్రజలకు సరియైన రక్షణ లేకుండాపోయింది, అంతేకాకుండా అప్పుడు రాచరిక పాలన ఉండేది. అంటే రాజు పదవి వారసత్వంగా వచ్చేది.
అప్పటి సాంఘిక పరిస్థితులు గురించి చర్చిద్దాం.
అప్పుటి వృత్తుల వల్ల కులాలు ఏర్పడ్డాయి. సమాజం అగ్ర కులాలు, నిమ్న కులాలు గా విడిపోయింది. అగ్ర కులాలు చెప్పిందే వేదం గా ఉండేది. ఒక విదంగా అగ్రకులాలు నిమ్నకులాలను అనేక బాధలకు గురిచేసేవారు. దళితుల పరిస్థితి మరింత ఆధ్వానంగా ఉండేది.
అప్పటి సమాజం వాళ్ళ హక్కులను వారికి కాకుండా చెసింది.
స్త్రీ లకు సమాజంలో సముచిత స్థానము లేదు. విద్య
ఏ వర్గం వారికీ అందుబాటులొ లేదు. మూఢనమ్మకాలు ఎక్కువగా
ఉండేవి. బాల్య వివాహలు , సతీ నహగమనం అట్లాగె బానిసత్వం ఆనాటి సమాజంలొ ఎక్కువగా ఉన్నాయి. చదువు అగ్ర కులాలకు తప్ప సామన్యులకు అందేది కాదు. చాలా మంది ప్రజలు వ్యవసాయం మీదె ఆధార పడి జీవించేవారు. చేనెత పరిశ్రమ తప్పిస్తే
మిగిలిన ఏ పరిశ్రమ అంతగా అబివృద్ది సాధించలేదు.

ఇంకా ఉంది.......

3 comments:

  1. *విద్య ఏ వర్గం వారికీ అందుబాటులొ లేదుచదువు అగ్ర కులాలకు తప్ప సామన్యులకు అందేది కాదు.*
    ఆరోజుల్లో ఉన్న విద్యలో ఏ సబ్జేక్ట్స్ ఉన్నాయి? అవి చదువుకొనిన వారి పరిస్థితి ఎమీటీ? చదువుకొన్న వారు ఎంతమంది ఉండేవారు? వారుఎంత వరకు చదువుకొని ఎక్కడ, ఎటువంటి పదవులు చేపట్టారు తెలిస్తే చెప్పేది.

    ReplyDelete
  2. *అప్పుటి వృత్తుల వల్ల కులాలు ఏర్పడ్డాయి. ....చేనెత పరిశ్రమ తప్పిస్తే
    మిగిలిన ఏ పరిశ్రమ అంతగా అబివృద్ది సాధించలేదు.*

    ఇటువంటి వాటినే ఈ మధ్యే మతం మారిన నా మిత్రుడు నాతో అన్నాడు. క్రైస్తవం చాలా అడ్వాన్సేడ్ మతం అని, అందువలననే బ్రిటిష్ వారు అభివృద్ది చెందారని తనకున్న చరిత్ర జ్ఞానాన్ని బయట పెట్టుకొన్నారు.ఇప్పటివరకు నేనడిగిన ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వలేదు. మీకు తెలియక పోతే చెప్పేది.

    ReplyDelete